నంద్యాలలో టిడిపి, వైసీపీ అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవా?

Published : Aug 07, 2017, 04:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
నంద్యాలలో టిడిపి, వైసీపీ అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవా?

సారాంశం

ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీ అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవంటూ ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకోవటం గమనార్హం.

నంద్యాలలో ప్రధాన పార్టీల ఫైట్ తాజాగా ఎన్నికల సంఘం మెట్లెక్కింది. ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీ అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవంటూ ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకోవటం గమనార్హం. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, ఆదాయపు పన్ను రిటర్నులు సరిగా దాఖలు చేయలేదని వైసీపీ ఫిర్యాదు చేసింది. కాగా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి నామిషన్ చెల్లదంటూ టిడిపి ఫిర్యాదు చేయటం విశేషం. శిల్పా తన నామినేషన్ను నిబంధనల ప్రకారం జ్యుడీషియల్ కాగితాలు వాడలేదని టిడిపి ఆరోపణలు చేసింది.   శిల్పా మోహన్ రెడ్డి కి సంతకాలు చేసిన నోటరీ రామ తులసీరెడ్డి పదవి అయిపోయింది కాబట్టి ఆయన చేసిన సంతకాలు చేల్లవని టిడిపి ఆరోపిస్తోంది.

రెండు పార్టీలు కూడా ప్రత్యర్ధిపార్టీల నామినేషన్లు చెల్లవంటూ తమ అభ్యంతరాలను ఒకేరోజు రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఇవ్వటం గమనార్హం. మరి, రెండు పార్టీల నుండి వచ్చిన ఫిర్యాదులు కరెక్టేనంటూ ఇద్దరి అభ్యర్ధుల నామినేషన్లను ఎన్నికల సంఘం గనుక తిరస్కరిస్తే అప్పుడు పరిస్ధితి ఎలాగుంటుందో?

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్