కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణహత్య

Published : Sep 11, 2018, 07:21 AM ISTUpdated : Sep 19, 2018, 09:22 AM IST
కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణహత్య

సారాంశం

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి మండలం అలంకొండకు చెందిన రామకృష్ణ పందిర్లపల్లిలో రేషన్ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి మండలం అలంకొండకు చెందిన రామకృష్ణ పందిర్లపల్లిలో రేషన్ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది హతమార్చారు.

రామకృష్ణ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రామకృష్ణ నివాసానికి చేరుకుని.. హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు..నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే