రూ.3కోట్ల విలువైన నిషేధిత ఫారిన్ సిగరెట్లు... స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

Arun Kumar P   | Asianet News
Published : Jan 01, 2021, 08:00 AM IST
రూ.3కోట్ల విలువైన నిషేధిత ఫారిన్ సిగరెట్లు... స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

సారాంశం

విజయవాడలోని భవానిపురం ఐరన్ యార్డులోని ట్రాన్స్ ఫోర్ట్ కార్యాలయం భారీగా నిషేధిత ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు నిల్వ వుంచినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. 

విజయవాడ: పాత సంవత్సరానికి స్వస్తి పలికి నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సమయంలో యువత పార్టీల్లో మునిగిపోతారు. దీంతో వారిని టార్గెట్ గా చేసుకుని భారీగా నిషేధిత పారిన్ సిగరెట్ల స్మగ్లింగ్ కు ప్రయత్నించిన ముఠాపై కృష్ణా జిల్లా విజయవాడలో  టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి చేశారు.

విజయవాడలోని భవానిపురం ఐరన్ యార్డులోని ట్రాన్స్ ఫోర్ట్ కార్యాలయం భారీగా నిషేధిత ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు నిల్వ వుంచినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మెరుపుదాడి చేసిన పోలీసులు మూడు కోట్ల విలువైన రెండు లక్షలా నలభై నాలుగు వేల సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ లాజిస్టిక్స్ సౌత్ ఇండియా ద్వారా ఢిల్లీ నుంచి విజయవాడకు ఇవి వచ్చినట్టు గుర్తించారు.

ఈ స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తూ విజయవాడకు చెందిన నల్లపనేని శ్యాం, గుంటూరుకు చెందిన హరిలను విచారిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిషేదిత సిగరెట్లు అమ్ముతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా ముఠా గుట్టు రట్టు చేసిన సిబ్బందిని అభినందించిన సీపీ బత్తిన శ్రీనివాసులు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu