తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో ఘర్షణ.. ఏపీ భక్తులపై తమిళనాడు వాసుల దాడి

Siva Kodati |  
Published : Jun 03, 2022, 05:36 PM ISTUpdated : Jun 03, 2022, 05:40 PM IST
తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో ఘర్షణ.. ఏపీ భక్తులపై తమిళనాడు వాసుల దాడి

సారాంశం

తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సుధాకర్ అనే భక్తుడు గాయపడ్డాడు. దీంతో అతనిని అశ్వీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

తిరుమల సర్వదర్శనం (tirumala sarvadarshanam) క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అనంతపురం జిల్లా (anantapur district) ఉరవకొండకు చెందిన సుధాకర్ అనే భక్తుడు గాయపడ్డాడు. అతనిని అశ్వీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాష విషయంలో భక్తుల మధ్య గొడవ జరిగిందని.. పోలీసులు తెలిపారు. ఏపీ భక్తులపై తమిళనాడుకు చెందిన భక్తులు దాడి చేసినట్లు చెప్పారు. దాడికి పాల్పడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. తిరుమలలో (tirumala) భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు లగేజీ కౌంటర్ సిబ్బంది. గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉదయం 8.30 గంటలకు ఇచ్చిన లగేజీని భక్తులకు ఇవ్వలేదు. లగేజీ ఏదని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

మరోవైపు.. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణంగా గంటకు 4500 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే ప్రస్తుతం గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తప్పలేదని టీటీడీ (ttd) అధికారులు చెబుతున్నారు. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఈ కంపార్ట్ మెంట్లలో 4 కి.మీ.మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.   వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గాను కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu