తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 22, 2024, 8:08 PM IST
Highlights

సుమారు నాలుగు దశాబ్ధాలుగా తాడిపత్రి కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు జేసీ బ్రదర్స్. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో పెద్దారెడ్డి బ్రేక్ వేశారు. నేరుగా జేసీ ఇంటికి అనుచరులతో వెళ్లి పెద్ద సంచలనం సృష్టించారు పెద్దారెడ్డి. సిమెంట్ ఫ్యాక్టరీల, నాపరాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయినప్పటికీ మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు . పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి.  1985లో మొదలైన జేసీ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రెడ్డి మంత్రిగానూ చక్రం తిప్పారు. మరోసారి తాడిపత్రిలో గెలవాలని జగన్ పట్టుదలగా వున్నారు. ఈసారి జేసీ అస్మిత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ప్రకటించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేరు చెప్పగానే.. ఫ్యాక్షన్ రాజకీయాలు, జేసీ బ్రదర్స్ గుర్తొస్తారు. రాష్ట్రమంతా రాజకీయాలు ఓ లెక్కలో సాగితే.. తాడిపత్రిలో మరోలా వుంటాయి. సిమెంట్ ఫ్యాక్టరీల, నాపరాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయినప్పటికీ మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు . ఉద్యానవన పంటలకు కేంద్రంగా తాడిపత్రి నిలిచింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయాన్ని ఇక్కడి రైతులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్ధాలుగా తాడిపత్రి కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు జేసీ బ్రదర్స్. అలాంటి జేసీ బ్రదర్స్ రాజకీయానికి 2019లో పెద్దారెడ్డి బ్రేక్ వేశారు. నేరుగా జేసీ ఇంటికి అనుచరులతో వెళ్లి పెద్ద సంచలనం సృష్టించారు పెద్దారెడ్డి. 

తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. జేసీ ఫ్యామిలీకి అడ్డా :

తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,34,741 మంది ఓటర్లున్నారు. పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. తాడిపత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌కు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 1985లో మొదలైన జేసీ శకం 2014 వరకు ఎదురు లేకుండా సాగింది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రెడ్డి మంత్రిగానూ చక్రం తిప్పారు.

కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో పది సార్లు, టీడీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 92,912 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి జేసీ అస్మిత్ రెడ్డికి 85,400 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 7,533 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా తాడిపత్రిలో పాగా వేసింది.

తాడిపత్రి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. కేతిరెడ్డి మళ్లీ షాకిస్తారా :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. మరోసారి తాడిపత్రిలో గెలవాలని జగన్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో పట్టు బిగిస్తున్నారు జేసీ. 70 ఏళ్ల వయసులోనూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ తన అనుచర వర్గాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఈసారి జేసీ అస్మిత్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ప్రకటించారు. దీంతో మరోసారి ఇద్దరు ఉద్ధండుల మధ్య తాడిపత్రిలో పోరు జరగనుంది. 
 

click me!