డోర్ డెలివరీకీ గ్రీన్ సిగ్నల్.. సీఎం జగన్ కి స్విగ్గీ స్పెషల్ థ్యాంక్స్

By telugu news teamFirst Published Apr 21, 2020, 10:01 AM IST
Highlights

కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీకి స్విగ్గీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కి ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ఏపీలో ఆన్‌లైన్‌ ద్వారా కూరగాయల డోర్‌ డెలివరీకి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న ఈ గడ్డు సమయంలో వినియోగదారులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేసింది. 

 

1/2: Thankyou Honorable CM of Andhra Pradesh Sri , Special Officers for COVID-19 Mr. Krishna babu, Mr.,& Mr. for providing us an opportunity to serve the customers of AP during these tough times. The e-pass system of AP is very user friendly

— Swiggy (@swiggy_in)

ఏపీ ఈ-పాస్‌ పద్ధతి దరఖాస్తుదారులకు సహాయకారిగా నిలిచిందని పేర్కొంది. త్వరలో ఏపీ వ్యవసాయశాఖతో కలిసి తాజా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ మేరకు స్విగ్గీ ట్వీట్ కూడా చేసింది.

 కాగా, కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించి సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా కూరగాయలు, పండ్ల డోర్ డెలివరీకి స్విగ్గీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా... తెలంగాణలో మాత్రం స్విగ్గీ, జొమాటో వంటి సేవలపై నిషేధం విధించారు. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకడంతో.. తెలంగాణ సీఎం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  కాగా.. తెలంగాణ లో లాక్ డౌన్ కూడా వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ లోనూ కొన్ని సడలింపులు చేశారు. 

click me!