వైఎస్ జగన్ ట్విట్టర్ శుభాకాంక్షలకు చంద్రబాబు రిప్లై

Published : Apr 21, 2020, 07:17 AM IST
వైఎస్ జగన్ ట్విట్టర్ శుభాకాంక్షలకు చంద్రబాబు రిప్లై

సారాంశం

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు. జగన్ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

అమరావతి: తనకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి రిప్లై ఇచ్చారు. ధన్యవాదాలు... సంతోషం, జగన్ గారు అంటూ చంద్రబాబు రిప్లై ఇచ్చారు. 

 

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జగన్ తన జన్మదిన వేడుకల సందేశంలో ఆశించారు. 

చంద్రబాబు నాయుడు సోమవారం తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. హైదరాబాదులో ఉన్న చంద్రబాబు ఈ రోజు నిరాడంబరంగా తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. 

ఇదిలావుంటే, చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనవడు దేవాన్షు వెరైటీగా ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం