మెరుగైన చికిత్స: వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్యను హైద్రాబాద్‌కు తరలించే అవకాశం

Published : May 04, 2023, 11:22 AM IST
మెరుగైన చికిత్స: వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్యను  హైద్రాబాద్‌కు తరలించే అవకాశం

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య ను మెరుగైన  చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.  మూడు  రోజుల క్రితం  రంగయ్య అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.   

తిరుపతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఇంటి వద్ద వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య ను  మెరుగైన చికిత్స  కోసం  హైద్రాబాద్ కు తరలించనున్నారు. మూడు  రోజుల క్రితం  అస్వస్థతకు  గురైన రంగయ్యను   చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.  అస్తమాతో  రంగయ్య తీవ్ర  అనారోగ్యానికి గురయ్యారు.  స్విమ్స్ ఆసుపత్రి వైద్యులు  రంగయ్యకు చికిత్స అందిస్తున్నారు. రంగయ్యకు  మెరుగైన వైద్యం కోసం  హైద్రాబాద్ తరలించాలని  వైద్యులు భావిస్తున్నారు. 

రెండేళ్ల క్రితం   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  రంగయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు.  దీంతో రంగయ్యకు  1+1 భద్రతను కేటాయించారు అధికారులు.   వైఎస్ వివేకానందరెడ్డి   హత్య జరిగిన  రోజున  రంగయ్య అదే ఇంటి వద్ద కాపలాగా ఉన్నాడు.  హత్య జరిగిన  రోజున ఏం జరిగిందనే విషయమై  ఆయన దర్యాప్తు అధికారులకు  వాంగ్మూలం ఇచ్చారు. దీంతో  రంగయ్యకు  పోలీస్ భద్రతను కేటాయించారు.

 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami