ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ప్రభుత్వ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్; రాష్ట్రంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారంనాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దుర్గగుడి సూపరింటెండ్ నగేష్, విజయవాడ పటమట సబ్ రిజిష్ట్రార్ రాఘవరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
విజయవాడ దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
undefined
దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ నివాసంలో భారీగా ఆస్తులను గుర్తించారు. రూ. 17. 91 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, ద్వారకా తిరుమలలో ఓ ఇల్లును ఏసీబీ అధికారులు గుర్తించారు. నగేష్ కుటుంబ సభ్యులు, బంధువల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మరో వైపు విజయవాడ పటమట సబ్ రిజిష్ట్రార్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో డ్యూప్లెక్స్ ఇల్లు, ఓ ఫ్లాట్ , ఆవనిగడ్డలో ఇంటి స్థలంతో పాటు ఇతర ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉంటే కర్నూల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుజాత నివాసంలో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.