ఒప్పందాలపై అనుమానాలా ?

Published : Jan 31, 2017, 08:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఒప్పందాలపై అనుమానాలా ?

సారాంశం

ఇపుడు చేసుకున్న ఒప్పందాలు కూడా గత ఏడాది ఒప్పందాల్లాంటివేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

భాగస్వామ్య సదస్సులో రూ. 10.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన ఆనందం రెండు రోజులు కూడా ప్రభుత్వంలో నిలవలేదు. సదస్సు ముగిసిన వెంటనే ఒప్పందాలపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. ఊరు, పేరు లేని వ్యక్తులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల తాలూకు ఫొటోలు బయటపడటంతో అసలు సదస్సే నవ్వులపాలవుతోంది. దాంతో ఇపుడు చేసుకున్న ఒప్పందాలు కూడా గత ఏడాది ఒప్పందాల్లాంటివేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

భాగస్వామ్య సదస్సు, పెట్టుబడులపై ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నది.  అయితే, పెట్టుబడుల ఒప్పందాల తాలూకు ప్రచారంలోని డొల్లతనం మెల్లిగా బయటపడుతోంది. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న అనేక కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఫొటోలు దిగారు. వారిలో కొందరు ఫొటోలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. సదరు ఫొటోలు, ఫొటోల్లోని వారి చరిత్ర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పెట్టుబడుల విషయంలో జరుగుతున్న ప్రచారం  మొత్తం భోగస్ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

పై ఫొటోలోని వ్యక్తి కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తరపున ప్రతినిధిగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. సదరు వ్యక్తి పేరు సుధీర్ చౌదరి. విజయవాడ సమీపంలోని ఓ కళాశాలలో విద్యార్ధులను కమీషన్లపై చేర్చే వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. కమీషన్ పై రియల్ ఎస్టేట్ సంస్ధలో కూడా పనిచేస్తున్నాడట. సుధీర్ భార్య అంగన్ వాడీ టీచర్. అటువంటి వ్యక్తి భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకోవటమేమిటని అందరూ విస్తుపోతున్నారు. అదే విధంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వారిలో మరోవ్యక్తి ఓ కిళ్ళీకొట్టు నడుపుతున్నట్లు సమాచారం.

 

ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవటానికి భారీ సంస్ధల ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం అనుకున్నది. అయితే, అంచనాల మేరకు సంస్ధల ప్రతినిధులెవరూ సదస్సుకు రాలేదని సమాచారం. దాంతో కంపెనీల తరుపున ప్రభుత్వంతో సంతకాలు చేయటానికి మనుషులు అవసరమయ్యారు. దాంతో అధికారులు కొందరు మనుషులను ఏర్పాటు చేసారని సమాచారం. అటువంటి బాపతే ఫొటోలోని వ్యక్తి. మొత్తానికి సదస్సులేమిటో, గోలేమిటో?

 

 

PREV
click me!

Recommended Stories

గుర్తుపెట్టుకో నిన్ను వదలను అసెంబ్లీ నుంచి జగన్ కు వార్నింగ్ | CM Chandrababu Speech in Assembly
అసెంబ్లీలో జగన్ కి చెమటలు పట్టించిన చంద్రబాబు | CM Chandrababu Naidu speech in Assembly | Jagan