వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ తీరుపై సుప్రీం అసహనం.. కీలక ఆదేశాలు..

By Sumanth KanukulaFirst Published Mar 27, 2023, 12:24 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొంది. ఈ కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని ప్రశ్నించింది. రాజకీయ వైరం అని మాత్రమే రాశారని.. దీనిపై ముందుకు వెళ్తే ఎప్పటికీ శిక్ష పడదని కీలక వ్యాఖ్యలు చేసింది.

వివేకా హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో విచారణ అధికారిని మార్చాలని లేకపోతే మరో అధికారిని నియమించాలని చెప్పింది.  సీబీఐ సీల్డ్ కవర్ నివేదికను పూర్తిగా చదివామని తెలిపింది. మెరిట్స్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

click me!