దేవుడు స్క్రిప్ట్ తిరగరాస్తున్నాడు ... జగన్ రెడ్డి కి సినిమా చూపించడం ఖాయం : దేవినేని ఉమ (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 27, 2023, 11:04 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సినిమా చూపించడం ఖాయమని టిడిపి నేత దేవినేని ఉమ అన్నారు. 

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకి జగన్ రెడ్డి నోరు పడిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తెలుగుదేశం దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పోయినా తిరువూరు మీటింగులో దిగలేదు ..! దుష్ట చతుష్టయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా అని అందరిని తిట్టిపోసాడు... కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోయేసరికి దిగినట్లుంది... నిన్న దెందులూరు మీటింగ్ లో నోరు పడిపోయిందని అన్నారు. దేవుడు స్క్రిప్ట్ తిరగరాస్తున్నాడు... తాడేపల్లి కొంప రహస్యాలు బయటికి వస్తున్నాయని మాజీ మంత్రి అన్నారు. 

వై నాట్ 175 అన్న జగన్ రెడ్డికి గ్రాడ్యుయేట్లు, ఎమ్మెల్యేల మాదిరిగానే ప్రజలు కూడా సినిమా చూపించడం ఖాయమని ఉమ అన్నారు. ఇప్పుడు నాలుగు పీకాయి... రేపు మిగిలినవి ప్రజలు పీకేస్తారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబాయి మర్డర్, కోడి కత్తి నాటకమాడి సానుభూతితో... అమలు సాధ్యంకాని హామీలు, అమలు సాధ్యంకాని హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు... ఈసారి ఈ ఆటలు సాగవని ఉమ అన్నారు. 

జగన్ రెడ్డి పాలనలో ఆ కలియుగదైవం తిరుమల వెంకటేశ్వర స్వామికే రక్షణ లేకుండా పోయిందని ఉమ ఆందోళన వ్యక్తం చేసారు. పరకామణి బయటకు తీసుకువెళ్తారా ? స్వామివారి డబ్బులనే గుడి దాటించారంటే వైసిపి నాయకులు ఎంత గుండెలు తీసిన బంటులు అంటూ మండిపడ్డారు. పవిత్ర తిరుమల కొండమీద మద్యం, గంజాయి అమ్ముతుంటే సిగ్గు లేదా ? అని ఉమ మండిపడ్డారు.  

వీడియో

ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం గంజాయి మాఫియాకు సహకరిస్తోందని... అందువల్లే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుంతోందని ఉమ ఆరోపించారు. గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నది అధికార వైసిపి నాయకులేనని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు.  2021లో దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 26% వుందని ఎసీసీబీ నివేదికలో పేర్కొందని తెలిపారు. రాష్ట్రం నుంచి రోజుకు టన్నుల కొద్దీ గంజాయి రవాణా అవుతుందన్నారు. ఇప్పుడు ఏకంగా తిరుమల కొండపైనే గంజాయ దందా ప్రారంభించారని ఉమ మండిపడ్డారు. 

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కొంప పక్కన గల పెట్రోల్ బంక్ లో సిబ్బందిపై గంజాయి మత్తులో యువకులు దాడిచేసి భీభత్సం సృష్టించారని ఉమ గుర్తుచేసారు.ఇక గతంలో పెళ్లి చేసుకోవాల్సిన జంట కృష్ణా నది తీరంలో కూర్చుంటే యువకున్ని చితకబాది యువతిపై అత్యాచారానికి పాల్పడితే ఇప్పటివరకు నిందితులకు పట్టుకోలేదని అన్నారు. గుంటూరులో మెడికల్ స్టూడెంట్ రమ్యను గొంతుకోసి చంపేసినా చర్యలు లేవన్నారు. 

పాపాల భైరవుడు ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన, సలహాదారు సజ్జల, ఫైనాన్స్ సెక్రటరీ జైలుకు వెళ్ళడం ఖాయమని ఉమ అన్నారు. వీరి పాపాలన్ని బయటపడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. అనేక అవినీతి కేసులు తనపైనే పెట్టుకుని బెయిల్ పై బయటున్న ముఖ్యమంత్రి జగన్ టిడిపి మీద మీద బురద జల్లుతున్నాడని అన్నారు. 

చంద్రబాబు నాయుడు ఈ దేశ సంపద అని ఉమ అన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చేసి ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా చంద్రబాబు పెట్టిన బయో టెక్నాలజీ పార్క్ లోంచి వచ్చిందేనని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి డిజైన్లలో ప్రపంచంలోని ఆరు గొప్ప డిజైన్లలో ఒకటిగా నిలిచింది... అటువంటి అమరావతి చంపే అధికారం నీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి?అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ది గురించి మీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు... ఒక్క ఇటుకయినా పెట్టావా అంటూ నిలదీస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి కూడా జై అమరావతి అనే రోజు త్వరలోనే వస్తుందని దేవినేని ఉమ పేర్కొన్నారు. 
 

click me!