ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీం

By narsimha lode  |  First Published Oct 9, 2023, 4:13 PM IST


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. 



అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను  సుప్రీంకోర్టు  మంగళవారానికి వాయిదా వేసింది .ఇవాళ  చంద్రబాబు తరపు తరపు న్యాయవాది హరీష్ సాల్వే  వాదనలు విన్పించారు. రేపు ఉదయం  ఏపీ సీఐడీ తరపున  ముకుల్ రోహత్గీ  వాదనలు విన్పించనున్నారు.  తాను  ఈ విషయమై వాదనలు  రేపు విన్పిస్తానని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. రోహత్గీ అభ్యర్ధనను  సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు  17 ఏ చుట్టూ తిరిగింది.17 ఏ అనేది డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ వర్తిస్తుందా లేదా డేట్ ఆఫ్ అఫెన్స్ కింద వర్తిస్తుందా అనేది కోర్టు ముందుంచామని హరీష్ సాల్వే  చెప్పారు.

Latest Videos

undefined

నేరుగా నగదు తీసుకుంటూ  పట్టబుడితే తప్ప మిగిలిన అన్నింటికి 17 ఏ వర్తిస్తుందని  హరీష్ సాల్వే  వాదించారు. ఏసీబీ చట్టం కింద కేసు పెడితే ఈ పాటికి తమకు ఉపశమనం లభించేదన్నారు. రిమాండ్ రిపోర్టును ఛాలెంజ్ చేస్తున్నామని  సాల్వే  తెలిపారు.రిమాండ్ రిపోర్టుపైనే తమ వాదనంతా అని సాల్వే వాదించారు. 17 ఏకు సంబంధించి పంకజ్ భన్సల్ కేసును హరీష్ సాల్వే ఉదహరించారు.

17 ఏకు వర్తించే అన్ని కేసుల్లో ప్రతి సందర్భంలో అనుమతి తీసుకోవాలన్నది కేంద్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేసిందని సాల్వే వాదించారు. డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ సాల్వే వాదించారు. 2021  సెప్టెంబర్ 7న ఫిర్యాదు వస్తే...2021 డిసెంబర్ 9న ప్రాథమిక విచారణ జరిగిందని సాల్వే సుప్రీంలో వాదనలు విన్పించారు.ఈ కేసుతో డిజైన్ టెక్ కు సంబంధించిందని  సాల్వే వాదించారు. 

ఒప్పందం ఎవరితో జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని సాల్వే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లు వాదనలు పూర్తయ్యాక  ఉంచుతామని మీరు చెబుతున్నారని... ఆ డాక్యుమెంట్లలో ఉన్నదానిపై కౌంటర్ దాఖలు చేసే సమయం మీకు లేకపోయిందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. 17 ఏ అనేది అవినీతి నిరోధానికి ఉండాలే కానీ కాపాడేందుకు కాదని  జస్టిస్ గుర్తు చేశారు.

click me!