అరసవల్లిలో రెండో రోజూ ఆదిత్యుడిని తాకిన సూర్య కిరణాలు

Published : Mar 10, 2020, 08:10 AM IST
అరసవల్లిలో  రెండో రోజూ ఆదిత్యుడిని తాకిన సూర్య కిరణాలు

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును మంగళవారం నాడు కూడ సూర్య కిరణాలు తాకాయి. సోమవారం నాడు కూడ స్వామివారిని  సూర్యకిరణాలు తాకిన విషయం తెలిసిందే.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును మంగళవారం నాడు కూడ సూర్య కిరణాలు తాకాయి. సోమవారం నాడు కూడ స్వామివారిని  సూర్యకిరణాలు తాకిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో స్వామి బంగారుఛాయలోకి మారి భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం నాడు  ఉదయం 6: 25 గంటల నుండి 6: 34 గంటల వరకు సూర్య కిరణాలు ఆదిత్యుని పాదాలను తాకాయి.  మంగళవారం నాడు కూడ సుమారు ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు  తాకాయి.

అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో సూర్య కిరణాలు  రెండో రోజూ కూడ తాకాయి.  ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. రెండు రోజులుగా భక్తులు ఈ ఆలయాన్ని తండోపతండాలుగా సందర్శిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu