కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా: కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్

By narsimha lodeFirst Published Oct 4, 2022, 11:47 AM IST
Highlights

తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ప్రకటించారు. బీజేపీ  ఏపీకి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

అమరావతి: కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రానికి తాము ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. 

రాహుల్ని భారత్మి జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనకు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు.   మంగళవారం నాడు జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్ లు విజయవాడలో  మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన  హామీలను  బీజేపీ అమలుచేయలేదన్నారు.  తాము అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఆ సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు కోరిన విషయాన్ని జైరామ్ రమేష్ గుర్తు చేశారు..కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా ఏపీకి ప్రత్యేక హోదాను  వెంకయ్యనాయుడు ఎందుకు సాధించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

 దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. భారత్ కు భిన్నత్వంలో ఏకత్వం  బలమన్నారు. కానీ బీజేపీ దీన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్రనుచూసి బీజేపీ భయపడుతుందన్నారు.భారత్ లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుందన్నారు.రాష్ట్ర విభజన ఏపీకి గాయం చేసిందని అంగీకరిస్తున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ చెప్పారు. 

2014 లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏపీ ,పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చింది. అయితే 2014లోజరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారార్ని కోల్పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 2014లో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యత్కేక ప్యాకేజీని తీసుకున్నారు. ప్రత్యేక హోదాక సమానమైన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు. ప్రత్యేక హోదా ను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంపై విపక్షాలు అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాయి. 
 

click me!