గంజాయి సేవిస్తున్న విద్యార్థులు అరెస్ట్...(వీడియో)

Published : Feb 19, 2022, 12:36 PM IST
గంజాయి సేవిస్తున్న విద్యార్థులు అరెస్ట్...(వీడియో)

సారాంశం

ఏపీలో గంజాయి నిర్మూలనకోసం  ఆపరేషన్ పరివర్తన్ లో భారీ స్తాయిలో గంజాయిని దహనం చేసినా.. గంజాయి వాడకాన్ని నిరోధించలేకపోతున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో గంజాయి సేవిస్తున్న విద్యార్ధుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

కృష్ణజిల్లా : మచిలీపట్నంలో జగన్నాథపురంలో జోరుగా ganja విక్రయం సాగుతోంది. students గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జగన్నాథపురం రైసుమిల్లు వెనకాల ఖాళీ స్థలంలో విద్యార్ధులు  గంజాయి సేవిస్తున్నారు. కాగా పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్టూడెంట్స్ పారిపోయారు. వీరిని వెంబడించిన పోలీసులు చాలాసేపు ఛేజీంగ్ తరువాత ఎస్సై అనూష ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. 

"

ఇదిలా ఉండగా, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో cannabisని ఏపీ Police శాఖ దహనం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై ద్వంసం, సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా AOB తో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగు పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ.. ఆ క్రమంలో పట్టుబడిన గంజాయిని దహనం చేసింది. 

కాగా, ఫిబ్రవరి 12న అప్పటికి డీజీపీ హోదాలో ఉన్న గౌతమ్ సవాంగ్ 
ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమసాగు కొనసాగుతుందన్నారు. గత శనివారం విశాఖలో పర్యటించిన ఆయన .. మీడియాతో మాట్లాడుతూ పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. 

గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని డీజీపీ తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారని.. అనేక రకాల మార్గాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారని.. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒడిశాలోని 23 జిల్లాల్లో, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగు అవుతోందని డీజీపీ పేర్కొన్నారు. 

ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశామని గౌతం సవాంగ్ చెప్పారు. గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేశారని.. గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేశామని డీజీపీ వెల్లడించారు.

ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాదినం చేసుకున్నామని.. 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 314 వాహనాలు సీజ్ చేసామని.. ఇతర రాష్ట్రాలకు చెందిన 154 మంది స్మగ్లర్లతో పాటు కొత్తగా 300 పైగా కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచామని డీజీపీ చెప్పారు. నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేశామని.. ఇక్కడ పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి తగులబెట్టామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్