
Stone Attack on Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్బంగా నాయకులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డిపై రాళ్లదాడి జరిగింది. బస్సుయాత్ర సందర్భంగా విజయవాడలో ఈ ఘటన జరగ్గా.. జగన్ కంటి పై భాగంలో గాయం అయింది. ఈ ఘటన మరువక ముందే ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక దుండగుడు రాయితో దాడి చేశాడు.
జగన్ ఘటన తర్వాతి రోజే పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరగడం కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ వారాహి యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే . గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ యాత్ర సందర్భంగా ఒక వ్యక్తి పవన్ పై రాయి విసరడం కలకలం రేపింది. అయితే, రాయి పవన్ పవన్ కళ్యాణ్ కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే పవన్ పైకి రాయిని విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్ పై రాళ్లదాడి పక్కా ప్లాన్ ప్రకారమేనా? ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? వీడియో దృశ్యాలు