దారుణం: చెట్టుకు కట్టేసి భార్య కూతురిపై అత్యాచారం

Published : Aug 17, 2018, 10:00 AM ISTUpdated : Sep 09, 2018, 11:31 AM IST
దారుణం: చెట్టుకు కట్టేసి భార్య కూతురిపై అత్యాచారం

సారాంశం

తల్లితో కాపురం చేస్తూ ఆమె కూతురిపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఒంగోలు: తల్లితో కాపురం చేస్తూ ఆమె కూతురిపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్‌కు చెందిన ఓ మహిళ నివాసం ఉంటోంది. భర్త ఏడేళ్లక్రితంమరణించాడు. దీంతో కుమార్తెతో పాటు చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది. 

ఆమెను మూడేళ్ల క్రితం కందుకూరు గ్రామానికి చెందిన మల్లారపు శివయ్య పెళ్లి చేసుకున్నాడు. అతను కూడా స్థానికంగా వారితో పాటు కలిసే ఉంటున్నాడు. ఇటీవల బాపయ్యనగర్‌ నుంచి బాలికను శివయ్య కందుకూరు తీసుకెళ్లాడు. 

కందుకూరు తీసుకెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఏమీ తెలియనట్టు ఆ బాలికను బాపయ్య నగర్‌ తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. కందుకూరు తీసుకెళ్లి అక్కడ ఓ చెట్టుకు కట్టేసి అత్యాచారం చేశాడని ఆమె తల్లి వద్ద వాపోయింది. 

దాంతో బాధితురాలి తల్లి ఈ సంఘటనపై గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్