అమెరికాలో ప్రమాదం: శ్రీకాకుళం వాసి రవికుమార్ మృతి

Published : Jan 27, 2023, 12:10 PM IST
అమెరికాలో ప్రమాదం: శ్రీకాకుళం వాసి  రవికుమార్ మృతి

సారాంశం

అమెరికాలో  జరిగిన ప్రమాదంలో  శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు  రవికుమార్  మృతి చెందాడు. 

శ్రీకాకుళం: అమెరికాలో జరిగిన ప్రమాదంలో  శ్రీకాకుళం జిల్లాకు  చెందిన యువకుడు  రవికుమార్  మృతి చెందాడు. అమెరికాలో విధుల్లో చేరిన  మూడు  రోజులకే  రవికుమార్  మృతి చెందినట్టుగా  కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.  ఈ ఘటన రవికుమార్ కుటుంబంలో విషాదాన్ని నింపింది.  

విధుల్లో చేరిన మూడు రోజులకే రవికుమార్  మరణించాడు.ఈ నెల  17వ తేదీన రవికుమార్  శ్రీకాకుళం నుండి అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. కంటైనర్ నుండి రవికుమార్  కిందపడడంతో  మృతి చెందాడు.  శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి  రవికుమార్ స్వగ్రామం.  రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసి  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు