రంగంలోకి కిషన్ రెడ్డి: శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్ట్, పోలీసులపై వేటు

By narsimha lodeFirst Published Sep 20, 2020, 11:06 AM IST
Highlights

 శ్రీశైలం ఆలయం దర్శనం విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య  తీవ్ర వాగ్వాద చోటు చేసుకొంది. దీంతో తమపై పోలీసులు చేయిచేసుకొన్నారని. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

శ్రీశైలం: శ్రీశైలం ఆలయం దర్శనం విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య  తీవ్ర వాగ్వాద చోటు చేసుకొంది. దీంతో తమపై పోలీసులు చేయిచేసుకొన్నారని. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన కలకలం రేపింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులపై వేటు పడింది.

శ్రీశైలం ఆలయ దర్శనానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఆలయంలో దైవ దర్శనానికి సమయం మించిపోయింని సెక్యూరిటీ అధికారులు చెప్పారు. ఈ విషయమై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. 

ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై పోలీసులు చేయిచేసుకొన్న విషయమై  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ డీజీపీ గౌతంసవాంగ్  తో కేంద్ర మంత్రి ఫోన్ లో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేశారు.  ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై  చేయి  చేసుకొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటేశారు. 

నలుగురు పోలీసులను కర్నూల్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ముగ్గురు సిబ్బందిని తొలగించారు. ఈ ఘటనపై ఆత్మకూర్ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. మరో వైపు శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ అధికారిని బదిలీ చేశారు. కొత్తగా శ్రీహారిని  సీఎస్‌ఓగా నియమించారు.

click me!