మార్కులు రాలేదని లెక్చరర్ వీరంగం.. విద్యార్థుల్ని జుట్టుపట్టుకుని కొడుతూ రచ్చ..

Published : Mar 24, 2021, 04:15 PM IST
మార్కులు రాలేదని లెక్చరర్ వీరంగం.. విద్యార్థుల్ని జుట్టుపట్టుకుని కొడుతూ రచ్చ..

సారాంశం

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే కొంతమంది లెక్చరర్లు ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థుల్ని చావచితకగొడుతున్నారు. కరోనా మహమ్మారికి వెరవకుండా తల్లిదండ్రులు ధైర్యం చేసి తమ పిల్లలను విద్యార్థులను కళాశాలలకు పంపిస్తున్నా కొన్ని కాలేజీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారుణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విచక్షణారహితంగా దండించాడు.

భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్ కు దూరంగా వెళ్లినా, వారి మీదికి విరుచుకు పడి మరీ, జుట్టుపట్టుకుని చేయి చేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ.. ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు.

అయితే అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి  తన సెల్ఫోన్ లో ఈ వీడియోను రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీకి పంపితే లెక్చరర్ల అమానుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం