రామతీర్థం : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం.. ఎస్పీ

Bukka Sumabala   | Asianet News
Published : Jan 02, 2021, 03:20 PM ISTUpdated : Jan 02, 2021, 03:21 PM IST
రామతీర్థం : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం.. ఎస్పీ

సారాంశం

రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే. 

ఈ దుశ్చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఎస్సీ రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘29న రామతీర్ధంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆ ముందు రోజు అంటే 28న విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో 20 మందిని విచారిస్తున్నాం. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. 

ఇక రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రామతీర్ధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు