పాముకాటుకు మరో ఇద్దరు రైతుల బలి....22 రోజుల్లో 85 మందికి పాముకాట్లు

By Arun Kumar PFirst Published Aug 23, 2018, 1:02 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు పాముకాట్లకు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఎక్కువగా పాముకాట్లకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణా జిల్లాలో తాజాగా ఇవాళ ఉదయం మరో ఇద్దరు రైతులు పాముకాటుకు గురై మరణించారు. దీంతో జిల్లా వాసులు పాముల భయంతో వణికిపోతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు పాముకాట్లకు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఎక్కువగా పాముకాట్లకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణా జిల్లాలో తాజాగా ఇవాళ ఉదయం మరో ఇద్దరు రైతులు పాముకాటుకు గురై మరణించారు. దీంతో జిల్లా వాసులు పాముల భయంతో వణికిపోతున్నారు.

కోడూరు మండలం పెదమాచవరానికి చెందిన రైతు శివయ్య తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. అయితే పోలం గట్టుపై నుండి వెళుతుండగా అతడు పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతడు మృతిచెందాడు. ఇదే జిల్లాలోని విశ్వనాథపల్లి గ్రామంలో కూడా మరో రైతు పాముకాటుతో మృతిచెందాడు.

అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు రోజుకు పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 30 మంది పాముకాటు బాధితులు చికిత్స పొందుతున్నారు.   కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత 22 రోజుల్లోనే 85 కేసులు, నాలుగు నెలల్లో 300 కేసులు నమోదయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గన్నవరంలలో పాముల బెడద ఎక్కువగా ఉందని రైతులు, అధికారులు చెబుతున్నారు.

ఇక గుంటూరు జిల్లాలోనూ ఈ పాముకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. రేపల్లె మండలంలో గత వారం రోజులుగా 43 మందికి పాముకాటు కేసులు నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే దాదాపు 14 మంది పాముకాటుకు గురైనట్లు సమాచారం.

వర్షాకాలంలో బొరియల్లోంచి బైటకు వచ్చే పాములు వరి మళ్లలో ఎలుకల కోసం సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళుతున్న రైతులు ఈ పాముల కాటుకు గురై చనిపోతున్నట్లు అధికారులు తెలిపారు. పాముకాటు బాధితుల కోసం గ్రామాల్లోని ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో కూడా మందులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి

ఆలయంలో 15 పాముల కలకలం....నాగుపాము, తాడిజెర్రి, కట్లపాము... అన్నీ విషసర్పాలే

పాముకాటుకు మరో ఇద్దరు బలి, కృష్ణా జిల్లాలో పెరుగుతున్న మృతులు

 

click me!