వారంతా కాలవగట్లపై తలదాచుకుంటున్నారు ఎందుకంటే..

By sivanagaprasad KodatiFirst Published Aug 20, 2018, 5:00 PM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో  దువ్వ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకయ్యవయ్యెరు కాలువకు వరద నీరు భారీగా పోటెత్తడంతో చుట్టూ ఉన్న ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దువ్వ గ్రామం అంతా జలమయమైంది. 

ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లాలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో  దువ్వ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకయ్యవయ్యెరు కాలువకు వరద నీరు భారీగా పోటెత్తడంతో చుట్టూ ఉన్న ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దువ్వ గ్రామం అంతా జలమయమైంది. 

ఫలితంగా 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో వారంతా ఎర్రకాలువ గట్లపైనే తలదాచుకుంటున్నారు. అక్కడే తినడం అక్కడే నిద్రపోతున్నారు. వర్షం కురిసినా ఎటు వెళ్లలేని పరిస్థితి. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతున్నారు. ఎర్రకాలువకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తమ గ్రామం మునిగిపోయిందని స్థానికులు చెప్తున్నారు. దీంతో రెండు గేట్లు ఎత్తివేసి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. 

click me!