ఈదురు గాలులతో వర్షం: ఏపీ సచివాలయం వద్ద కూలిన స్మార్ట్‌ఫోల్

By narsimha lodeFirst Published May 7, 2019, 4:48 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం నాడు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  మధ్యాహ్నాం ఒక్కసారిగా ఈదురుగాలుతో వర్షం కురిసింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం నాడు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  మధ్యాహ్నాం ఒక్కసారిగా ఈదురుగాలుతో వర్షం కురిసింది. ఈదురు గాలులు భారీగా వీయడంతో సచివాలయంలో  స్మార్ట్ పోల్ విరిగి పడింది.

మంగళవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 

గాలితో పాటు వర్షం కారణంగా  రాజధాని ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి.  సచివాలయ ప్రాంగంణంలోని స్మార్ట్‌ఫోల్, ఎంట్రీపాయింట్ కుప్పకూలాయి. బ్లాక్ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడ్డాయి.  నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలుల ధాటికి విరిగిపోయాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడ వర్షం కురిసింది.

click me!