2023 మార్చికి వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

By narsimha lodeFirst Published Sep 29, 2022, 5:51 PM IST
Highlights

వచ్చే ఏడాది మార్చి నాటికి రాషఫ్ట్రంలోని అన్ని  వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగిస్తామని ఏపీ మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మీటర్లపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు

అమరావతి:అమరావతి: 2023 మార్చినాటికి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు  బిగిస్తామని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బిగింపుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు  మీటర్లు బిగించామన్నారు. త్వరలోనే మరో  77వేల కనెక్షన్ లను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా చెప్పారు.

also read:వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లతో నష్టం లేదు: ఏపీ అసెంబ్లీలో జగన్

విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని  రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు..ఇప్పటికే 70 శాతం మంది రైతులు డిబిటి కోసం ఖాతాలను తెరిచినట్టుగా  మంత్రి వివరించారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం  సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందని మంత్రి వివరించారు.   శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో  ఇది నిరూపితమైందని మంత్రి తెలిపారు. స్మార్ట్ మీటర్లపై మాట్లాడుతున్న విపక్షాలు శ్రీకాకుళంలో పర్యటించాలని ఆయన సూచించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చంద్రబాబుకు  జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వంత పాడుతున్నాయని  ఆయన విమర్శించారు. విపక్షాలే రైతులకు అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. 
 

click me!