విచిత్రం : బ్యాలెట్ బాక్సుల్లో.. నంద్యాల తాగుబోతుల విన్నపం..

Published : Mar 15, 2021, 11:08 AM IST
విచిత్రం : బ్యాలెట్ బాక్సుల్లో.. నంద్యాల తాగుబోతుల విన్నపం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు సిబ్బందిని ఆశ్చర్యపరిచాయి. ‘నంద్యాల తాగుబోతుల విన్నపం’ పేరుతో ఈ చీటీలు ఉన్నాయి. 

వీటిల్లో మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లైన సుప్రీం, దారు, హైదరాబాద్, జంబోలను తొలగించాలని, వాటి స్తానంలో పాత బ్రాండ్లైన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ రకాలు అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నపం ఉంది.

ఈ మేరకు  తెల్లకాగితం మీద ముంద్రించిన చీటీలు లభ్యమయ్యాయి. పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందని హెచ్చరిక కూడా అందులో ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే