భార్యపై అనుమానం.. మెడకు ఉరేసి చంపి...

Published : Mar 15, 2021, 10:23 AM ISTUpdated : Mar 15, 2021, 10:30 AM IST
భార్యపై అనుమానం..  మెడకు ఉరేసి చంపి...

సారాంశం

ఆమెపై భర్త గురుమూర్తి అనుమానం ఎక్కువ. వేరే ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందేమోనని ఆయన అనుమానం. ఈ క్రమంలో భార్యను హత్య చేశాడు.

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఉరి బిగించి హత్య చేసి.. అనంతరం ఆత్మహ్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన శ్రీకాకుళంలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా సారవకోట ప్రాంతానికి చెందిన సుశీల(32) కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లైంది. కాగా.. ఆమెపై భర్త గురుమూర్తి అనుమానం ఎక్కువ. వేరే ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందేమోనని ఆయన అనుమానం. ఈ క్రమంలో భార్యను హత్య చేశాడు.

సుశీల స్థానికంగా జరుగుతున్న మహాశివరాత్రి యాత్ర మహోత్సవానికి శనివారం వెళ్లివచ్చింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న భర్త గురుమూర్తి ఎక్కడికి వెళ్లావని నిలదీస్తూ భార్యతో గొడవ పడ్డాడు.

తరువాత సుశీల పశువుల శాల తుడిచేందుకు వెళ్లగా.. గురుమూర్తి కూడా వెళ్లాడు. అక్కడ ఉన్న యూరియా గోనె సంచె ముక్కను సుశీల మెడకు గట్టిగా బిగించడంతో స్పృహ తప్పిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను గురుమూర్తి, అతని తమ్ముడు ఎండెయ్య సహాయంతో పశువుల శాలలోని కర్రకు తాడుతో కట్టేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించి బయటకు వచ్చేశారు. కాసేపు తరువాత ఎండెయ్య ఏం తెలియనట్టు.. పెద్దమ్మ, పెద్దనాన్న గొడవ పడ్డారని, పెద్దమ్మ ఏమి చేస్తుందో చూడండని తన పిల్లల్ని పంపించారు. వారు వెళ్లి శాలలో చూడగా.. ఉరి వేసుకుని ఉన్నట్లు చెప్పడంతో ఏమీ తెలియనట్టు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి సుశీలను కిందికి దించినట్టు ఎస్సై వివరించారు.

గురుమూర్తి, సుశీలలు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండేవారని, ఆ కారణంగానే ఆమె ఉరి వేసుకొని ఉంటుందని స్థానికులు కూడా భావించారన్నారు. మీ కుమార్తె ఉరి వేసుకుని మృతి చెందిందని సుశీల తల్లి సరసమ్మకు సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొవడంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వాస్తవం వెలుగు చూసిందన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్