చేబ్రోలులో ఆటోను ఢీకొన్న టిప్పర్, ఎనిమిది మంది మృతి

Published : Oct 22, 2018, 03:52 PM ISTUpdated : Oct 22, 2018, 06:25 PM IST
చేబ్రోలులో ఆటోను ఢీకొన్న టిప్పర్, ఎనిమిది మంది మృతి

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోల్ మండలం చేబ్రోలు వద్ద  సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు  అక్కడికక్కడే మృతి చెందారు


కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోల్ మండలం చేబ్రోలు వద్ద  సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సంఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరూ మృతి చెందారు.

సోమవారం నాడు  చేబ్రోలు వద్ద  టిప్పర్‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానికులు సమీపంలో ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.  

విశాఖ జిల్లా మాకవరంపాలెం మండలం జి.వెంకటాపురం గ్రామానికి చెందిన వారంతా  కాకినాడలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఎదురెదురుగా ఆటోను  టిప్పర్ ఢీకొట్టడంతో  వ్యాన్‌లోని ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.చికిత్స పొందుతూ మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.

 వీరంతా తుని నుండి కాకినాడ వెళ్తుండగా చేబ్రోలు వద్ద  ఈ ఘటన  చోటు చేసుకొంది.  విషయం తెలిసిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations