వైఎస్ వివేకా హత్య: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురి విచారణ

By narsimha lodeFirst Published Dec 2, 2019, 6:14 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులను కడప పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురిని విచారిస్తున్నారు. 

డప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లాకు చెందిన ప్రముఖులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో పది రోజుల పాటు అనుమానితులను ఈ కేసులోప్రశ్నించనున్నట్టుగా కడప ఎస్పీ స్పష్టం చేశారు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడ పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారణ చేశారు. మరో పది రోజుల పాటు అనుమానితులను విచారణ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. 

కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలోనే వైఎస్ వివేకానందరెడ్డి ఈ ఏడాది మార్చి 14వ తేదీ  రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నాడు. ఆ సమయంలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.

అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏపీలో ఎన్నికలయ్యాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జగన్ సీఎంగా ఎన్నికయ్యాక మరో సిట్‌ను ఏర్పాటు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. 

Also read:వైఎస్ వివేకా హత్య కేసు: కొలిక్కి వస్తున్న దశలో కడప ఎస్పీ బదిలీ

ఈ సిట్ విచారణ కొనసాగిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుల విచారణను సిట్ కొనసాగిస్తోంది. సోమవారం నాడు పులివెందుల నుండి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు విచారణ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 


 

click me!