చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తా: దీక్ష విరమించిన భువనేశ్వరి

By narsimha lode  |  First Published Oct 2, 2023, 5:53 PM IST

చంద్రబాబుపై కేసులను నిరసిస్తూ  ఇవాళ  టీడీపీ ఆధ్వర్యంలో సత్యమేవజయతే పేరుతో  ఒక్క రోజు దీక్ష చేపట్టారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీక్ష నిర్వహించారు. 


రాజమండ్రి:చంద్రబాబు అరెస్ట్‌ తో మృతి చెందిన  కుటుంబాలను త్వరలోనే పరామర్శించనున్నట్టుగా నారా భువనేశ్వరి ప్రకటించారు.చంద్రబాబుపై కేసులను నిరసిస్తూ  సోమవారం నాడు రాజమండ్రిలో సత్యమేవజయతే పేరుతో  నారా భువనేశ్వరి దీక్ష నిర్వహించారు. భువనేశ్వరికి  చిన్నారులు నిమ్మరసం ఇచ్చి  దీక్షను విరమింపజేశారు. ఇవాళ సాయంత్రం దీక్ష ముగింపును పురస్కరించుకొని భువనేశ్వరి ప్రసంగించారు. తన ఆయుష్షును కూడ పోసుకుని చంద్రబాబు జీవించాలని భువనేశ్వరి ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల బాగు కోసమే దీక్షలో పాల్గొన్నానని ఆమె చెప్పారు.

స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని భువనేశ్వరి గుర్తు చేశారు.కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలని చంద్రబాబు తాను కోరేదాన్నని ఆమె ప్రస్తావించారు. ఎప్పుడూ ప్రజల బాగు కోసమే చంద్రబాబు పరితపించారన్నారు.

Latest Videos

undefined

తన తండ్రి ఎన్టీఆర్, తన భర్త చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో కూడ తాము ఏనాడూ  జోక్యం చేసుకోలేదన్నారు.  రాష్ట్రం, ప్రజల బాగు కోసమే నిత్యం చంద్రబాబు ఆలోచించేవారన్నారు.తమ కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడ లేదన్నారు.తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని భువనేశ్వరి తెలిపారు.ఎన్టీఆర్ స్పూర్తితో  చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్లారని  ఆమె చెప్పారు.ప్రభుత్వ నిధులను తాము ఏనాడూ దుర్వినియోగం చేయలేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.

హైద్రాబాద్ లో ఐటీ అభివృద్దికి చంద్రబాబు కృషి చేశారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత  ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, పోలవరం గురించి  చంద్రబాబు పరితపించేవారని భువనేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు.చంద్రబాబు రోజులో మూడు,నాలుగు గంటలే నిద్రపోయేవారన్నారు.

చంద్రబాబు పదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.వచ్చే ఎన్నికల్లో మీ ఓటును సరిగా వేయాలని కోరుకుంటున్నానని భువనేశ్వరి  ప్రజలను కోరారు.మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని చంద్రబాబు కోరుకొనేవారన్నారు.చంద్రబాబు అరెస్టుతో 105 మంది మృతి చెందడం బాధాకరమని భువనేశ్వరి చెప్పారు.మరణించిన 105 మంది కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తానని భువనేశ్వరి తెలిపారు.

click me!