సింహాచలం ట్రస్టు వివాదం: అసలు ఈ మన్సస్ ట్రస్టు కథేంటి?

By Sree sFirst Published Mar 7, 2020, 3:50 PM IST
Highlights

అసలు ఈ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటి ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసారు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా మొదలయింది. అందరూ గూగుల్ లో దీన్ని విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి మీరు కూడా ఆ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటో చూద్దాం.   

అశోక్ గజపతి రాజును కాదని ఎప్పుడైతే ఆయన అన్న కూతురు సంచయితను మన్సాస్ ట్రస్టు చైర్మన్ ను చేసారో... అప్పటి నుండి మొదలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటి నుండో ఆనంద గజపతి రాజు కుటుంబానికి అశోక్ గజపతి రాజు కుటుంబానికి మధ్య ఉన్న మనస్పర్థలకు ఇప్పుడు ఇలా రాజకీయ రంగు కూడా తోడవడంతో అది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. 

ఈ నేపథ్యంలో అసలు ఈ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటి ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసారు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా మొదలయింది. అందరూ గూగుల్ లో దీన్ని విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి మీరు కూడా ఆ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటో చూద్దాం.   

మన్సాస్ అంటే.... 

మహారాజా అలక్ నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్( మన్నాస్) ను  మహారాజా అలక్ నారాయణ్ గజపతి రాజు గుర్తుగా  1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు.  ఇందుకోసం పీవీజీ రాజు దాదాపు 13000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.

ఈ ట్రస్టు కింద కేజీ నుంచి పీజీ వరకు విద్యనందించే 12 విద్యాసంస్థలున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ లా వంటి స్పెషలైజ్డ్ కోర్సులను కూడా ఈ విద్యాసంస్థల కింద అందిస్తున్నారు. ఈ 1857లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 

Also read: మా నాన్న చితి ఆరక ముందే...: బాబాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచయిత కంటతడి

1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ ట్రస్టులో దాదాపుగా 15,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విద్యాసంస్థలు వారికి ఆశాకిరణంగా వెలుగొందుతున్నాయి. 

ఈ విద్యాసంస్థల్లో చదువుకొన్న ఒక వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి వీవీ గిరి. ఆయన ఈ విద్యాసంస్థల్లోనే తన విద్యను అభ్యసించాడు. ఆయనతోపాటు ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద, మేజర్ కేవీ కృష్ణ రావు కూడా ఇక్కడాయనే. 

సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్లుగా, మన్సస్ ట్రస్టు బోర్డు చైర్మన్లుగా కేవలం గజపతి రాజవంశీకులు మాత్రమే వ్యవహరిస్తుంటారు. వంశపారంపర్యంగా వారు ఈ పోస్టులను అనుభవిస్తున్నందున వారే ఇప్పటికీ ఈ ట్రస్టులకు చైర్మన్లుగా కొనసాగుతున్నారు. 

1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ప్ అండ్ సైన్సెస్ (మాన్సాస్)ను నెలకొల్పారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు మాన్సాస్ విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 

1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతిరాజుకు మాన్సస్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆయన మాట్లాడారు. 

ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని ఈ మాజీ ఎంపీ అన్నారు. మాన్సాస్ ట్రస్టు వివాదం పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అశోక్ గజపతి రాజు స్పందించారు.

మాన్సాస్ ట్రస్ట్  ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ... వేరే మతం వారిని ఎలా నియమిస్తారని అన్నారు. 

click me!