నీసన్న బియ్యం సంగతి తేలుస్తా, నువ్వు తేల్చలేవ్: మంత్రి కొడాలి నాని, అచ్చెన్నాయుడుల ముచ్చట్లు

Published : Jul 11, 2019, 11:16 AM IST
నీసన్న బియ్యం సంగతి తేలుస్తా, నువ్వు తేల్చలేవ్: మంత్రి కొడాలి నాని, అచ్చెన్నాయుడుల ముచ్చట్లు

సారాంశం

నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ సరదాగా పలకరించారు అచ్చెన్నాయుడు. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీ లాబీల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో ఆయనను పలకరించారు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు.  

నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ సరదాగా పలకరించారు అచ్చెన్నాయుడు. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. 

ఈ సందర్భంగా అచ్చెన్న నీ సన్నబియ్యం సంగతి తేలుస్తానంటూ చెప్పుకొచ్చారు. నువ్వు ఏమీ తేల్చలేవు, సన్న బియ్యం ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అవసరం అయితే నీకు కూడా ఒక బస్తా బియ్యం పంపిస్తానంటూ సమాధానం చెప్పారు మంత్రి  కొడాలి నాని. దీంతో ఇరువురు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు కురిపించాయి.    

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!