కూతుళ్ల బలి కేసు..దుస్తులు విప్పేసి, నగ్నం చేసి.. విస్తుపోయే విషయాలు

Published : Jan 25, 2021, 08:40 AM ISTUpdated : Jan 25, 2021, 09:06 AM IST
కూతుళ్ల బలి కేసు..దుస్తులు విప్పేసి, నగ్నం చేసి.. విస్తుపోయే విషయాలు

సారాంశం

నాలుగు రోజుల నుంచి వీరి ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కూతుళ్లను బలి ఇచ్చేందుకు పురుషోత్తం, పద్మజలు స్థానిక బుగ్గవంకకు చెందిన ఒక స్వామీజీ సహాయం తీసుకున్నట్లు సమాచారం  

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను అతి దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. క్షుద్రపూజల నేపథ్యంలో కూతుళ్లను బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా... ఈ ఘటనకు సంబంధించిన కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.

ఉన్నత విద్యలు చదివిన పురుషోత్తమనాయుడు, పద్మజల ఇద్దరు కుమార్తెలను నిన్న ఉదయం వారు నివసిస్తున్న ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాక నాలుగు రోజుల నుంచి వీరి ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కూతుళ్లను బలి ఇచ్చేందుకు పురుషోత్తం, పద్మజలు స్థానిక బుగ్గవంకకు చెందిన ఒక స్వామీజీ సహాయం తీసుకున్నట్లు సమాచారం

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివాలయంవీధిలో ఇద్దరు కుమార్తెలను తల్లే బలి తీసుకుంది. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమనాయుడు, పద్మజలు గత మూడు రోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపిలేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం తల్లితోసహా ఇద్దరు పిల్లలు నగ్నంగా పూజలు చేశారు. ఈక్రమంలో పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోదీ చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసింది. చంపే ముందే.. ఇద్దరు బిడ్డలను ఇంటిచుట్టూ తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఇద్దరు కూతుళ్లను నగ్నం చేసి బలి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన గది సీసీటీవీ ఫుటేజీపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. దాని పాస్ వర్గ్ కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu