విశాఖ దివ్య హత్య కేసు..భర్తే ఆమెను అమ్మేసి...

Published : Jun 10, 2020, 11:24 AM IST
విశాఖ దివ్య హత్య కేసు..భర్తే ఆమెను అమ్మేసి...

సారాంశం

2014లో అయినవారిని కోల్పోవడంతో ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన దివ్య చిన్నమ్మ క్రాంతివేణి సంరక్షణలో పెరిగింది.  

విశాఖలో దివ్య అనే యువతి హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దివ్య అందాన్ని ఎరగావేసి ఓ ముఠా బాగానే డబ్బులు సంపాదించింది. ఆ డబ్బు విషయంలో దివ్య వారికి ఎదురు తిరగడంతో అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఈ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది.

ఈహత్య కేసులో భర్త వీరబాబు ప్రమేయం ఉన్నట్టు విశాఖ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 2014లో అయినవారిని కోల్పోవడంతో ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన దివ్య చిన్నమ్మ క్రాంతివేణి సంరక్షణలో పెరిగింది.

ఆ తర్వాత ఏలేశ్వరానికి చెందిన వీరబాబుతో ఆమెకు వివాహమైంది. అనంతరం విశాఖలో స్థిరపడ్డారు. దివ్యను వ్యభిచార గృహం నిర్వాహకురాలు వసంతకు భర్తే అప్పగించినట్టు పోలీసులు భావిస్తున్నారు. డబ్బు పంపకంలో వచ్చిన తేడాల నేపథ్యంలో ఆమెను హత్యచేసినట్టు విచారణలో తేలింది.

కాగా.. దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలున్నట్లు తేలగా, వీటిలో చాలావరకు అట్లకాడతో పెట్టినవే కాగా, చపాతీ కర్రతో కొట్టడం మరికొన్ని బలమైన గాయాలైనట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆమెకు గుండు గీసి.. కనుబొమ్మలు కూడా గీసేసి అందవికారంగా తయారు చేశారు. మత్తు ముందు ఇచ్చి మరీ చిత్ర హింసలకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేయగా.. ఆమె భర్త హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli