టీడీపీకి షాక్.. వైసీపీలోకి పరిటాల ముఖ్య అనుచరుడు

Published : Feb 08, 2019, 12:22 PM IST
టీడీపీకి షాక్.. వైసీపీలోకి పరిటాల ముఖ్య అనుచరుడు

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మంత్రి పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మంత్రి పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది. పరిటాల రవి ముఖ్య అతనుచరుడు వేపకుంట రాజన్న.. తాజాగా వైసీపీలో చేరారు. 

గురువారం కడప జిల్లాలో జగన్ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో రాజన్న.. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా.. జగన్ అతనికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం రాప్తాడు వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... వేపకుంట రాజన్న తమ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో తమకు మరింత బలం పెరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం