ఎన్నికల ముందు పవన్ కి షాక్...కీలక నేత రాజీనామా

Published : Mar 14, 2019, 01:24 PM IST
ఎన్నికల ముందు పవన్ కి షాక్...కీలక నేత రాజీనామా

సారాంశం

ఎన్నికల వేళ జనసేన కి ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలు అనగా.. పార్టీ కి కీలక నేత ఒకరు రాజీనామా చేశారు. 

ఎన్నికల వేళ జనసేన కి ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలు అనగా.. పార్టీ కి కీలక నేత ఒకరు రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కోకన్వీనర్ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో.. పార్టీ నిర్ణయంపై ఆయన అసంతృప్తి చెంది రాజీనామా చేసినట్లుగా సమాచారం. 

పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరితో వారికి టిక్కెట్లు ఇవ్వడం సరికాదని యర్రా నవీన్‌ వ్యాఖ్యానించారు.
 ఇదిలా ఉండగా  ఇవాళ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ రాజమండ్రిలో జరగనుంది. 

దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ నుంచి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu