కామాంధుడికి దేహశుద్ధి.. వలసవచ్చిన మహిళలపై కన్నేసి వేధింపులు..

By Bukka SumabalaFirst Published Aug 27, 2022, 10:42 AM IST
Highlights

వలసవచ్చి భవననిర్మాణ పనులు చేసుకునే ఒంటరి మహిళల్ని మాయమాటలతో లొంగదీసుకుని.. వారిని వేధిస్తున్న ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ది చేశారు. 
 

అనంతపురం :  అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన ఓ కామాంధుడికి రంగసముద్రం గ్రామంలో గురువారం రాత్రి చెట్టుకు కట్టేసి మహిళలు దేహశుద్ధి చేశారు. నేత్రపల్లి గ్రామానికి చెందిన భీమేష్ (28) గత కొన్నిఏళ్లుగా వివాహితులను మాయమాటలతో మభ్యపెట్టి తమ కామవాంఛలు తీర్చుకునేవాడు. ఉపాధి కోసం కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి వలసవెళ్లి.. అక్కడ గృహ నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై భీమేష్ కన్నేసేవాడు. ఇతని దుశ్చర్యలపై బాధితులు గుమ్మఘట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

అతడికి ఎనిమిదేళ్ళ క్రితం కర్ణాటకలో ఓ మహిళతో వివాహమయ్యింది. వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కానీ, వారిని వదిలేసి వచ్చేశాడు. వారం రోజుల క్రితం కలుగోడు గ్రామానికి చెందిన ఓ వివాహితపై బెంగళూరులో ఇలాంటి దురాగతానికే ఒడిగట్టారు. విషయం తెలిసిన కుటుం సభ్యులు ఆమెను గ్రామానికి తీసుకు వచ్చారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు గుమ్మగట్ట ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి నిందితుడు వివాహితకు ఫోన్ చేశాడు. అతనికి తెలియకుండా కుటుంబ సభ్యులు ఆ ఫోన్ విన్నారు. తను రంగసముద్రం వస్తున్నట్లు అతను వివాహితతో చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి, అతడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గుమ్మగట్ట ఎస్ ఐ సునీత కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ లో దారుణం.. పదేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి.. దేహశుద్ది..

ఇదిలా ఉండగా, మార్చిలో ఇలాంటి ఘటనే హైదారాబాద్, పటాన్ చెరులో చోటు చేసుకుంది. దైవంతో సమానంగా గౌరవించే గురువులు కూడా అమ్మాయిల పట్లనీచ కార్యానికి దిగజారుతుండడం దారుణమైన విషయం. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఓ ట్యూషన్ టీచర్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న సాల్మన్ రాజు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్ నిర్వహిస్తున్నాడు.  

స్థానిక ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ కి వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్ కి వెళ్లకుండా ఇంటివద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది.  స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజు నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!