మాతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో:మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలనం

Published : Mar 26, 2023, 04:05 PM IST
 మాతో  వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో:మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  సంచలనం

సారాంశం

వైసీపీలో  అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో  టచ్ లో  ఉన్నారని  మాజీ మంత్రి ప్రత్తిపాటి  పుల్లారావు  చెప్పారు.  

గుంటూరు: తమ పార్టీతో  చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని  మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు  చెప్పారు.

ఆదివారంనాడు  ఆయన  గుంటూరులో జరిగిన  పార్టీ కార్యక్రమంలో  ఆయ న  మాట్లాడారు. వైసీపీ సర్కార్ పై ప్రజల్లో  వ్యతిరేకత ఉందన్నారు. జగన్ సర్కార్ కు   ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉందన్నారు.  వచ్చే ఎన్నికల్లో  జగన్  పులివెందులలో గెలవడం కష్టమేనని ఆయన  చెప్పారు.తమ పార్టీ ముందస్తు  ఎన్నికలకు కూడా సిద్దంగా   ఉన్నట్టుగా  ప్రత్తిపాటి  పుల్లారావు  చెప్పారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల  24న  జరిగాయి.  అయితే  ఈ ఎన్నికల్లో వైసీపీ  ఒక్క అభ్యర్ధిని కోల్పోయింది.  టీడీపీ అభ్యర్ధి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటిం్  చేశారని  ఆ పార్టీ గుర్తించింది.  ఈ మేరకు  నలుగురు ఎమ్మెల్యేలపై  సస్పెన్షన్ వేటు వేసింది.  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,  ఉండవల్లి శ్రీదేవిలను  వైసీపీ నుండి  సస్పెండ్  చేసింది  వైసీపీ  నాయకత్వం.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?