ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కి కరోనా సోకింది. అంతేకాదు ఐదుగురు ఉద్యోగులకు కూడ కరోనా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు.
అమరావతి: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కి కరోనా సోకింది. అంతేకాదు ఐదుగురు ఉద్యోగులకు కూడ కరోనా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు.
also read:ఏపీలో కరోనా కరాళనృత్యం: 210 కొత్త కేసులు, మొత్తం 4,460 పాజిటివ్ కేసులు
undefined
ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేసే 10 మంది ఉద్యోగులకు కూడ కరోనా సోకింది. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కూడ కరోనా పాజిటివ్ గా తేలింది.
పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి కూడ కరోనా బారినపడ్డారు. సీఎం బ్లాక్ ఆర్‌టీజీఎస్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా కరోనా సోకింది. విద్యాశాఖలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడ కరోనా బారినపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం నాటికి 4,460కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 73 మంది మరణించారు.
లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి స్వంత రాష్ట్రానికి ప్రజలు వస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
విదేశాల నుండి వచ్చిన 131 మందికి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 741 మందికి కూడ కరోనా సోకింది.