
మాజీ ఎంఎల్ఏ వెంకట చెంగల్రావుకు కోర్టు జీవిత ఖైదు విధించటం సంచలనంగా మారింది. పదేళ్ళక్రితం బిఎంసికి వ్యతిరేకండా అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో ఓ వ్యక్తి మృతిచెందారు. మృతుని తరపు వ్యక్తులు చెంగలతో పాటు ఆయన అనుచరులపై కేసు దాఖలు చేసారు. ఆ కేసుకు సంబంధించే అనకాపల్లి సెషన్స్ కోర్టు ఈరోజు చెంగలతో పాటు మరో 15 మందికి కూడా జీవితఖైదు విధించింది. చెంగల్రావు గతంలో టిడిపి తరపున అనకాపల్లి ఎంఎల్ఏగా పనిచేసారు. చెంగల సినీ నిర్మాత కూడా.