కాకినాడ : ఇంజనీరింగ్ కాలేజ్‌లో జూనియర్లు , సీనియర్ల ఘర్షణ .. విద్యార్ధులకు గాయాలు

Siva Kodati |  
Published : Nov 14, 2022, 09:58 PM IST
కాకినాడ : ఇంజనీరింగ్ కాలేజ్‌లో జూనియర్లు , సీనియర్ల ఘర్షణ .. విద్యార్ధులకు గాయాలు

సారాంశం

కాకినాడ జిల్లా సూరంపాలెంలో వున్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫైనలియర్ విద్యార్ధులు సాయితేజ, సాయికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు  

కాకినాడ జిల్లా సూరంపాలెంలో వున్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం చెలరేగగా.. సాయికుమార్ అనే విద్యార్ధిపై నాగేంద్ర, సందీప్ అనే బీటెక్ సెకండియర్ విద్యార్ధులు. ల్యాబ్‌లోని వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారు విద్యార్ధులు. ఈ ఘటనలో ఫైనలియర్ విద్యార్ధులు సాయితేజ, సాయికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్ల మధ్య వార్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే.. ఇటీవల ఐఎస్‌బీ హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. 12 మంది విద్యార్ధులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీ కుదిర్చారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అంతకుముందే ర్యాగింగ్‌పై మంత్రి కేటీఆర్‌పై ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు బాధిత విద్యార్ధి. కేటీఆర్ ట్వీట్ తర్వాత 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

ALso REad:హాస్టల్ రూమ్‌లో బంధించి జూనియర్‌పై సీనియర్ల దాడి... హైదరాబాద్ ఐఎస్‌బీలో కలకలం

అంతకుముందు ... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  హాస్టల్ రూమ్‌లో అంకిత్ అనే విద్యార్ధిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేశారు సహచరులు. వాటితో విచక్షణారహితంగా కొట్టారు. ఐరన్ బాక్సుతో అతని ఛాతీపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ ప్రస్తుతం భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?