వైసీపీలోకి వట్టి వసంత్ కుమార్..?

Published : Nov 27, 2018, 02:54 PM ISTUpdated : Nov 27, 2018, 03:02 PM IST
వైసీపీలోకి వట్టి వసంత్ కుమార్..?

సారాంశం

వట్టి వసంత్ కుమార్.. వైసీపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

వట్టి వసంత్ కుమార్.. వైసీపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.  కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. వచ్చే నెలలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 3వ తేదీన ఎం.ఎం.పురంలో తన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో చర్చించి.. ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం నచ్చని వట్టి.. పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ ని ఎదుర్కోవాలంటే.. వైసీపీనే తనకు కరెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. కొందరు ఆయన అభిమానులు.. జనసేనలోకి వెళ్లాలని సూచిస్తున్నారట. దీంతో.. వైసీపీ, జనసేన రెండింట్లో ఏ పార్టీలో చేరాలో వట్టి తేల్చుకోలేకపోతున్నారట. ఈ వారం రోజుల్లో ఈ విషయంపై  పూర్తి స్థాయిలో చర్చించి..త్వరలోనే నిర్ణయం ప్రకటిద్దామని అనుకుంటున్నారుట. ఆయన వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో  నరసాపురం లోక్ సభ స్థానం టికెట్ ఏ పార్టీ ఇవ్వడానికి అంగీకరిస్తే.. ఆ పార్టీలోకి జంప్ అవ్వాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు