Sarvepalli assembly elections result 2024 : సర్వేపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

By Shivaleela Rajamoni  |  First Published Jun 4, 2024, 8:41 AM IST

Sarvepalli assembly elections result 2024 : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటి. ఇక్కడినుండి గత రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్ లో కీలకమైన వ్యవసాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా సర్వేపల్లినుండే పోటీచేస్తున్న కాకాని హ్యాట్రిక్ విజయంపై ధీమాతో వున్నారు. అయితే టిడిపి కూడా కాకానిని ధీటుగా ఎదుర్కొనే బలమైన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిను సర్వేపల్లిలో పోటీ చేయించింది. దీంతో ఈ అసెంబ్లీ పోరు ఆసక్తికరంగా మారింది. 


Sarvepalli assembly elections result 2024 : సర్వేపల్లి రాజకీయాలు :

సర్వేపల్లి నియోజకవర్గంలో వైసిపి బలంగా వుంది. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు (2004, 2009) సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన ప్రస్తుతం వైసిపిలోనే వున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (2014, 2019) లో వరుసగా విజయం సాధించారు. అంటే గత ఇరవైఏళ్లుగా సర్వేపల్లిలో టిడిపి గెలించింది లేదన్నమాట.

Latest Videos

undefined

సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి టిడిపి బాధ్యతలు చూసుకుంటున్నారు.  అయితే ఆయన 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ మరోసారి ఆయననే సర్వేపల్లి బరిలో నిలిపారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పొదలకూరు
2. తోటపల్లిగూడూరు
3.  ముత్తుకూరు
4. వెంకటాచలం
5. మనుబోలు 

సర్వేపల్లి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,30,446

పురుషులు -   1,12,829
మహిళలు ‌-    1,17,583

సర్వేపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మరోసారి సర్వేపల్లి బరిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిలిచారు. ముచ్చటగా మూడోసారి సర్వేపల్లిలో పోటీచేస్తున్నారు. చాలా చోట్ల సిట్టింగ్ లను మార్చడం, మరోచోటికి షిప్ట్ చేయడం లాంటి ప్రయోగాలు చేసిన వైసిపి సర్వేపల్లిలో మాత్రం ఆ పని చేయలేదు. 

 టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మరోసారి సర్వేపల్లి బరిలో నిలిపింది. వరుసగా ఓడిపోతున్నప్పటికీ టిడిపి మాత్రం సోమిరెడ్డిపై నమ్మకం పెట్టుకుంది. 

సర్వేపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

సర్వేపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,30,446  

వైసిపి - కాకాని గోవర్ధన్ - 97,272 ఓట్లు (51 శాతం) - 13,973 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - 83,299 ఓట్లు (43 శాతం) - ఓటమి
 
సర్వేపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   2,03,818  

వైసిపి - కాకాని గోవర్ధన్ రెడ్డి- 85,744 (49 శాతం) ‌- 5,446 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - 80,298 (46 శాతం) ఓటమి

click me!