2009 వరకు జనరల్ నియోజకవర్గంగా వున్న నందికొట్కూరు నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వుడుగా మారిపోయింది. ఈ సెగ్మెంట్ పరిధిలో పగిడ్యాల, మిడ్తూరు, జే బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడ్తూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం పేరుకు ఎస్సీ రిజర్వ్‌డ్ .. కానీ ఇక్కడ బైరెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం. 2004 వరకు బైరెడ్డి కుటుంబం హవా నడిచినా రాజశేఖర్ రెడ్డి టీడీపీని వీడటంతో ఆ ఫ్యామిలీ ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. 2024 ఎన్నికల్లో నందికొట్కూరుపై జగన్ ఫోకస్ పెట్టారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో వున్నారు. డాక్టర్ సుధీర్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్ధిగా గిట్టా జయసూర్యను బరిలోకి దించింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన నందికొట్కూరులో రాజకీయాలు వేడెక్కాయి. నవనందులు కొలువై ఉండటంతో ఈ ప్రాంతానికి నందికొట్కూరుగా పేరొచ్చింది. 2009 వరకు జనరల్ నియోజకవర్గంగా వున్న నందికొట్కూరు నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వుడుగా మారిపోయింది. ఈ సెగ్మెంట్ పరిధిలో పగిడ్యాల, మిడ్తూరు, జే బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడ్తూరు మండలాలున్నాయి. నందికొట్కూరులో మొత్తం ఓటర్ల సంఖ్య 1,97,451 మంది. 1952లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు.
నందికొట్కూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పేరుకు ఎస్సీ రిజర్వ్‌డ్, రెడ్లదే ఆధిపత్యం :
undefined
ఈ నియోజకవర్గం పేరుకు ఎస్సీ రిజర్వ్‌డ్ .. కానీ ఇక్కడ బైరెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం. ఇక్కడ బైరెడ్డి శేషశయనా రెడ్డి మూడు సార్లు, ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు విజయం సాధించారు. నందికొట్కూరులో గౌరు, బైరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా నడుస్తోంది. 2004 వరకు బైరెడ్డి కుటుంబం హవా నడిచినా రాజశేఖర్ రెడ్డి టీడీపీని వీడటంతో ఆ ఫ్యామిలీ ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. రాయలసీమ హక్కులంటూ పోరాటం చేసిన బైరెడ్డి.. తర్వాత బీజేపీలోకి మళ్లీ టీడీపీలో చేరారు. అయితే బైరెడ్డి తమ్ముడి కొడుకు సిద్ధార్ధ్ రెడ్డి వైసీపీ చేరడంతో రాజకీయాలు మారాయి. సిద్ధార్ధ్ రెడ్డి మాస్ లీడర్‌గా యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ ఆయనను స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు.
నందికొట్కూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి టీ ఆర్ధర్‌కు 1,02,565 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుకు 61,955 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ అభ్యర్ధి 40,610 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ గెలుపు వెనుక సిద్ధార్ధ్ రెడ్డి కష్టం వుంది. సాంప్రదాయంగా తన కుటుంబానికి వున్న ఓటు బ్యాంక్‌తో పాటు జగన్ మద్ధతుదారుల ఓట్లను వైసీపీకి వేయించగలిగారు. 2024 ఎన్నికల్లో నందికొట్కూరుపై జగన్ ఫోకస్ పెట్టారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో వున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరగా.. డాక్టర్ సుధీర్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు నందికొట్కూరులో టీడీపీ ప్రాబల్యం వుండేది. క్రమక్రమంగా ఆ వైభవాన్ని పార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం మద్ధతును చంద్రబాబు సంపాదించగలిగారు. ఈసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్ధిగా గిట్టా జయసూర్యను బరిలోకి దించింది. జగన్ పాలనపై వ్యతిరేకతతో పాటు బైరెడ్డి, గౌరు కుటుంబాల మద్ధతుతో నందికొట్కూరులో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.