పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి సర్పంచ్‌ల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Jul 3, 2023, 1:26 PM IST
Highlights

అమరావతిలో పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి  తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు.

అమరావతిలో పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి  తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. మరోవైపు పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.  వివరాలు.. పంచాయితీలకు వెంటనే నిధులను విడుదల చేయాలని రాష్ట్రంలో సర్పంచ్‌లు నిరసనకు దిగారు.  పంచాయితీరాజ్‌ కమిషనర్ కార్యాలయం ముట్టడికి సర్పంచ్‌లు పిలుపునిచ్చారు. 

ఈ క్రమంలోనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రబాబును తాడిపర్రులోని ఆయన ఇంట్లోనే గృహ నిర్భంధం చేశారు. అలాగే పలువురు సర్పంచులను కూడా గృహ నిర్భంధాలు చేశారు. ముందస్తు నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయంకు బయలుదేరిన కొందరు సర్పంచ్‌లను అడ్డుకుని పోలీసు స్టేషన్‌ను తరలించారు. అయితే మరికొందరు సర్పంచ్‌లు మాత్రం పంచాయితీరాజ్ కమిషనరల్ కార్యాలయానికి చేరుకుని నిరసనకు దిగారు. 

Latest Videos

కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అయితే వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. తమకు రావాల్సిన బకాయిలు, నిధులు వెంటనే విడుదల చేయాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాడుకున్న నిధులను సర్పంచ్‌ల ఖాతాల్లో వేయాలని కోరుతున్నారు. నిధులు లేక గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేని దుస్థితి నెలకొందని అన్నారు.

click me!