
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం వడ్డెర కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న బాలుడు మృతిచెందగా, అతడి తండ్రికి గాయాలయ్యాయి. వివరాలు.. బాలుడిని స్కూల్‌లో దింపేందుకు అతడి తండ్రి బైక్‌పై తీసుకెళ్తున్నాడు. అయితే వారి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే బైక్‌పై నుంచి పక్కకు పడిపోయిన బాలుడి తండ్రికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరకుని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు దిగుతుండగా చిన్నారి కాలుజారి పడిపోయింది. అయితే దీనిని గమనించుకుండా ఆమె పైనుంచి బస్సు వెళ్ళిపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.