జీవో నెంబర్ 1 సస్పెన్షన్ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిరాకరణ: విచారణ రేపటికి వాయిదా

By narsimha lode  |  First Published Jan 23, 2023, 4:30 PM IST

జీవో  నెంబర్ 1పై  విచారణను ఏపీ హైకోర్టు  రేపటికి వాయిదా వేసింది.  


అమరావతి: జీవో నెంబర్ 1పై  విచారణను  రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు . సోమవారం నాడు  ఉదయం నుండి   సాయంత్రం వరకు  ఈ పిటిషన్ పై  హైకోర్టు  సీజే ధర్మాసనం  విచారణ నిర్వహించింది.  మధ్యాహ్నం  లంచ్ బ్రేక్ తర్వాత   రాష్ట్ర ప్రభుత్వం తరపున  అడ్వకేట్ జనరల్ వాదనలను విన్పించారు. . ఈ పిటిషన్ పై  ఈ నెల  12న విచారణ నిర్వహించిన  వెకేషన్ బెంచ్  ఈ నెల  23వ తేదీ వరకు  జీవో నెంబర్  1ని సస్పెండ్  చేసింది. అయితే  ఈ సస్పెన్షన్ ను కొనసాగించాలని  పిటిషనర్ తరపు న్యాయవాది ఇవాళ కూడా  హైకోర్టును అభ్యర్ధించారు.

 అయితే  సస్పెన్షన్ ను  కొనసాగించేందుకు  హైకోర్టు  సీజే ధర్మాసనం సుముఖతను వ్యక్తం చేయలేదు.   అయితే  జీవో నెంబర్  1 సస్పెన్షన్ కు సంబంధించి   రేపటి నుండి అమల్లో ఉంటుందా  లేదా అనే విషయమై  స్పష్టత రావాల్సి ఉంది.ఈ జీవోను సస్పెన్షన్ ను కొనసాగించేందుకు  హైకోర్టు నిరాకరించినందున  రేపటి నుండి జీవో అమల్లో  ఉంటుందని  ఈ కేసును వాదించిన న్యాయవాది  ఒకరు  అభిప్రాయపడ్డారు. మరో వైపు  ఈ  విషయమై  దాఖలైన  తాజా పిటిషన్లను రేపు వాయిదా వేయనున్నట్టుగా  ఏపీ హైకోర్టు  ప్రకటించింది.  

Latest Videos

undefined

ప్రజల ప్రాణాలకు  ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  ప్రభుత్వం జీవో నెంబర్  1ని తీసుకు  వచ్చినట్టుగా  ప్రభుత్వ అడ్వకేట్ జనరల్  శ్రీరామ్  వాదించారు.   పోలీస్ యాక్ట్  30 మేరకు  ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని  ఏజీ వాదించారు.  పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తున్న వాదనలను అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చారు. 

 రోడ్లపై ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించడం వల్ల  రాష్ట్రంలోని  కందుకూరు, గుంటూరులలో   జరిగిన  తొక్కిసలాటల గురించి  అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ తొక్కిసలాటల్లో  11 మంది మృతి చెందిన విషయాన్ని  ఏజీ  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

also read:జీవో నెంబర్ 1 పై వెకేషన్ బెంచ్ విచారణ: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  పాల్గొన్న రెండు  సభల్లో  జరిగిన తొక్కిసలాటల నేపథ్యంలో  ఈ నెల  2వ తేదీన  జీవో  నెంబర్  1ని  ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ జీవోను నిరసిస్తూ  ఈ నెల  12వ తేదీన సీపీఐ రాష్ట్ర సమితి  కార్యదర్శి  రామకృష్ణ ఏపీ వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు.ఈ పిటిషన్ ను విచారించిప  ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్  జీవో నెంబర్  1ని సస్పెండ్  చేసింది. 


 


 

click me!