లాక్ డౌన్ సమయంలోనూ వాలంటీర్లకు పూర్తి జీతాలు... ప్రకటించిన జగన్ సర్కార్

By Arun Kumar PFirst Published Apr 27, 2020, 1:03 PM IST
Highlights

లాక డౌన్ సమయంలో ప్రభుత్వోద్యుగుల జీతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపి ప్రభుత్వం విడుదల చేసింది. 

అమరావతి: లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వోద్యుగుల జీతాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఏపి ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య,ఆరోగ్యశాఖ, పోలీసులు, పారిశుద్ద్య సిబ్బందికి పూర్తి వేతనాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, టీచర్లకు  సగం జీతం, 4వ తరగతి ఉద్యోగులు, ఒప్పంద్ద సిబ్బందికి 10శాతం మినహాయింపు ఇచ్చారు.

ఇకహోంగార్డులు, వార్డు, గ్రామ వాలంటీర్లకు పూర్తి వేతనం అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర  ముఖ్యమంత్రి, , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను 100 శాతం,  ఐ.ఎ.ఎస్ అధికారులకు 60 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

కరొనా విజృంభిస్తుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపిలోనూ లాక్ డౌన్  విధించారు. దీంతో భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం  గత(మార్చి)నెల ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. అదేవిధంగా ఈ నెల కూడా జీతాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న వారికి  మాత్రం జీతాల్లో కోత విధించడం లేదు. 

గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కూడా  ఇదేవిదంగా ప్రభుత్వోద్యుగులు జీతాల్లో  కోత విధించింది. విపత్కర కాలంలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిచింది తెలంగాణ సర్కార్.  అదే సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు.  

click me!