బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమో: సజ్జల

By Sumanth KanukulaFirst Published Sep 14, 2023, 4:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ గురువారం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ గురువారం ప్రకటించారు. ఈ పరిణామాలపై వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్,  చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్నట్టుగా నటించారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్ అని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పనిచేశారని.. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చూశారని విమర్శించారు. 

బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమోనని అన్నారు.  పవన్ ఎప్పుడూ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేదని.. ఆయన అభిమానులే తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైసీపీ సిద్దంగా ఉందని వెల్లడించారు. 

ఏపీలో అధికార పార్టీకి పాజిటివ్ ఓటు ఉందని చెప్పారు. ఏ సర్వేలోనైనా 70 శాతం మంది ప్రజలు జగన్ వైపే చూస్తున్నారని స్పష్టం అవుతుందని అన్నారు. ఇంకా ఏదైనా కారణాలతో కొంత ఓట్లు తగ్గినప్పటికీ.. తమకు 50 శాతం కంటే ఎక్కువే ఓటు బ్యాంకు ఉంటుందని.. ఎన్నిశక్తులు ఏకమైనా తమకు కలిగే నష్టమేమి లేదని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారని.. అదే తమ ధీమా అని  చెప్పారు. 

తాము ప్రజలకు చేయాల్సినవి చేశామని తెలిపారు. అటువైపు ఉన్న వ్యక్తులు ప్రజలకు చేసిందేమి లేదని.. వారు ఎంతసేపు మేకపోతు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 
 

click me!